చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనిపై స్పందించిన చైనా.. ఈ విక్రయాలను తీవ్రంగా ఖండించింది. వాటిని వెంటనే నిలిపివేయాలని, తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలను ఆపాలని కోరింది. మరోవైపు చైనా బెదిరింపుల నేపథ్యంలో మాతృ భూమిని రక్షించుకునే బాధ్యత తమకు ఉందని తైవాన్ విదేశాంగ శాఖ పేర్కొంది