TG: రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు, ఉరుములు తో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.