తిప్పతీగలోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఖనిజాలు ఎముకలు, కండరాలను బలపరుస్తాయి. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని కొవ్వులను కరిగించి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీపీ, మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆకులను నేరుగా తిన్నా.. రసం తాగినా ఫలితం ఉంటుంది.