ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. వాయు కాలుష్యం 349గా నమోదైంది. కాలుష్యం తీవ్రతతో కళ్లమంట, గొంతునొప్పి, శ్వాస సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, హర్యానాలో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వల్లే ఢిల్లీలో పరిస్థితి విషమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా, దీపావళికి ముందే ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరటంతో పండగ సమయంలో బాణసంచా విక్రయాలని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది.