AP: డ్వాక్రా, మెప్మా సభ్యులకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను నాశనం చేసిందని ఆరోపించారు. ప్రొఫైల్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల డేటా ప్యూరిఫికేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరుకు డేటా బేస్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.