AP: విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ గుర్లలో డయేరియా బాధితులను కలిసి పరామర్శించారు. ‘గుర్లలో డయేరియాతో ఇప్పటికే 14 మంది చనిపోయారు. 35 రోజుల క్రితం తొలి కేసు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను ట్వీట్ చేసినా సర్కార్ కదలిరాలేదు. ఎవరూ చనిపోలేదని చెప్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి’ అని పేర్కొన్నారు.