TG: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ అధికారులు 23 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,30,000, అవుట్ ఫ్లో 1,30,410 క్యూసెక్కులు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.210 మీటర్లు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.029 టీఎంసీలు ఉంది. అలాగే, జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.