TG: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,19,000, అవుట్ ఫ్లో 1,19,466 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.350 మీటర్లు ఉంది. జలవిద్యుత్ కేంద్రాల్లో 436 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.