AP: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో ఒక్కరే చనిపోయారని హోంమంత్రి అనిత అన్నారు. ఇతర అనారోగ్య కారణాలతోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలిపారు. డ్రైనేజీ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు గుర్లలో పర్యటించారని, త్వరలో నివేదిక వస్తుందని చెప్పారు. గుర్లలో గత ప్రభుత్వ పాపాలు ప్రజలకు శాపాలయ్యాయని మండిపడ్డారు. తల్లీచెల్లిపై జగన్ కేసు పెడతారని గతంలోనే తాము చెప్పినట్లు వెల్లడించారు.