TG: సంగారెడ్డి జిల్లాలో చెరువులో అక్రమంగా కట్టిన భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో కొందరు వ్యక్తులు 12 ఏళ్ల క్రితం చెరువులోనే ఓ భవనం నిర్మించారు. దీనికి కొంతదూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబసభ్యులు వారాంతాల్లో ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. ప్రస్తుతం దీన్ని బాంబుల ద్వారా అధికారులు నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో.. ఇద్దరికి గాయాలయ్యాయి.