TG: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 31,383 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రాస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో పరీక్షకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకునారు.