AP: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాల ప్రగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సహకరించాలని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి, వారి ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.