TG: కేంద్రమంత్రి బండిసంజయ్‌కి సీఎస్ శాంతికుమారి ఫోన్ చేసింది. జీవో 29పై చర్చలకు రావాలని ఆహ్వానం పలికింది. బండిసంజయ్ రావడం కుదరకపోతే బృందాన్ని పంపాలని సీఎస్ కోరింది. ఆందోళన విరమించాలని బండిసంజయ్‌కి విజ్ఞప్తి చేసింది. అయితే బండి సంజయ్‌కి సీఎం రేవంత్ ఫోన్ చేశాడనే వార్తలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు. తనకు సీఎం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు.