ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్ధం నేపథ్యంలో లెబనాన్ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అంగీకరించారని అన్నారు. అది జరిగిన కాసేపటికే బీరుట్లో ఆయనని హతమార్చారని తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులకు తెలియజేశామని వెల్లడించారు. కాగా, సెప్టెంబర్ 27న బంకర్లో తలదాచుకున్న నస్రల్లాను ఇజ్రాయెల్ బాంబులు వేసి చంపేసింది.