AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు హోంమంత్రి అనిత గుడ్న్యూస్ చెప్పారు. ఏడాదిన్నర క్రితం నిలిపిన కానిస్టేబుళ్ల నియామక పరీక్ష ప్రారంభిస్తామన్నారు. 6,100 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ, శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వెబ్ సైట్లో పూర్తి వివరాలు లభ్యం కానున్నాయని వెల్లడించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే.