కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే అధిక బరువుని తగ్గించుకోవట్టు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోటు, అలర్జీలు దూరం అవుతాయి.