TG: నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని మాజీమంత్రి KTR అన్నారు. ‘సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇకనుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణరేఖ గీయాలి. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజాసమస్యలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పదేళ్లు బుల్లెట్ వేగంతో పరుగులు తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అని అన్నారు.