TG: మాజీమంత్రి మల్లారెడ్డి ఇవాళ యాదాద్రిలో లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనతంరం హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా ప్రజలను రోడ్లపై పడేస్తోంది. అందరిలాగే నాకూ నోటీసులు ఇచ్చారు. దీని వల్ల ప్రజలకు ప్రశాంతత లేకుండా పోయింది. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పండిస్తే కాంగ్రెస్ నేతలకు పాలాభిషేకం చేస్తా. కాంగ్రెస్ అంటేనే గుంపు రాజకీయాలు.. అవి పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి” అని అన్నారు.