ఈ ఏడాది జూన్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆర్థిక ప్రణాళిక భేషుగ్గా ఉందని 15 మంది నోబెల్ గ్రహీతలు సమర్థించిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలాహారిస్ ప్రణాళికకు కూడా 23 మంది నోబెల్ గ్రహీతలు కితాబిచ్చారు. ఇటీవల నోబెల్ బహుమతి పొందిన సిమన్ జాన్సన్, డారెన్ ఏస్మోగ్లులు సైతం ఆ జాబితాలో ఉండటం గమనార్హం.