USలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ ఇంటర్వ్యూపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే ప్రశ్నకు 2 వేర్వేరు సమాధానాలను ప్రసారం చేశారంటూ మీడియా సంస్థపై మండిపడ్డారు. ఆమెకు సంబంధించి ఎడిట్ చేయని ఒరిజనల్ ఇంటర్వ్యూ ట్రాన్స్స్క్రిప్ట్ను బహిర్గతం చేయాలని సంస్థకు లేఖ రాశారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.