గంటలతరబడి ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. కంటి సమస్యలకు దారితీస్తోంది. కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. క్యారెట్ నేరుగా తిన్నా, జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలు, గుడ్లు, ఆకుకూరలను డైట్లో చేర్చుకోవాలి. తగినంత నిద్ర పోవడం వల్ల కళ్ల ఒత్తిడి, అలసట తగ్గుతాయి.