TG: మొండి బకాయిల వసూలుకు జలమండలి తీసుకొచ్చిన వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) గడువును మరో నెల రోజులు పొడిగించారు. గురువారంతో గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెలరోజులు పొడిగించాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మున్సిపల్ శాఖకు లేఖ రాశారు. దీంతో ఓటీఎస్ గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.