AP: భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. 2025 జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానంతో నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని, అక్రమ వసూళ్లను నిరోధించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.