ప్రకాశం: అద్దంకి పట్టణంలో కట్ట రామ్ కోటేశ్వరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సోమవారం అద్దంకి ఎస్సై ఖాదర్ బాషా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా కీలకమైందని మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.