ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. టమాటా గుజ్జు ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి. శనగపిండి, టమాటా రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.