ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరోసారి తమపై దాడి చేస్తే ఇరాన్ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. గతవారం ఇరాన్‌పై చేసిన దాడుల్లో పాల్గొన్న వారితో ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్‌ను మళ్లీ ఎలా గట్టిగా దెబ్బ కొట్టాలో బాగా తెలుసని తెలిపారు. కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టామని, వాటిపై మరో సందర్భంలో గురిపెడతామని పేర్కొన్నారు.