TG: రాష్ట్రంలోని ఆలయాలపై దాడుల నేపథ్యంలో VHP, భజరంగ్ దళ్ జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా అల్ఫా హోటల్, ప్యారడైజ్ సహా షాపులన్నీ మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.