TG: హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా దూసుకెళ్తోంది. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా 30 ప్రాంతాల్లో 300 అక్రమ కట్టడాలు కూల్చివేసింది. ఆక్రమణకు గురైన 120 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించింది. FTL, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులతో హైడ్రా చర్యలు చేపడుతోంది. GHMCతో పాటు ORR లోపల 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది.