ఈ సారి జరిగే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఎప్పుడూ పోటీచేయనని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా, నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ప్రత్యర్థి కమలా హారిస్‌తో తీవ్రమైన పోటీ ఉండనున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.