అమెజాన్ పేతో షాపింగ్ చేసినా, డబ్బులు పంపినా క్యాష్ బాక్, డిస్కౌంట్లు, బంపర్ రివార్డ్స్ ఇస్తామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ తెలిపింది. విమానాల బుకింగ్స్ పై 12శాతం, హోటల్ బుక్కింగ్స్ పై 55శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్ పే యూపీఐతో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఉబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చెల్లింపునకు అమెజాన్ పే వాడితే రూ.1,500 వరకు ఆదా చేయవచ్చు.