అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ 500 సంపన్నుల జాబితాలో 481వ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నిలిచారు. ట్రూత్ మీడియా టెక్నాలజీ షేర్లు సహా పలు వ్యాపారాలు పుంజుకోవడంతో ట్రంప్ సంపద 6.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.