YCP MLA కాసు మహేష్ రెడ్డి పల్నాడులో నిరసన దీక్ష..!
Kasu Mahesh Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడులో దీక్ష చేపట్టారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ గెట్ వద్ద గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
రూ.1190 కోట్ల తో 212 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణకు 2012లో పనులు ప్రారంభం కాగా ఈ నెల 14 వరకు పూర్తి చేయాల్సివుంది. కానీ ఈ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసారు. వాస్తవానికి క్యూబ్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ నిబంధనల ప్రకారం ఈ నెల 14 వరకు పూర్తి చేయాల్సివుంది. కానీ ఈ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని పలుమార్లు అధికారులకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఫిర్యాదు చేసారు . అయినా ఎలాంటి స్పందనలేకపోవడంతో నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.
రైల్వే శాఖ అనుమతుల కోసం 2022 మార్చి లో రూ.13 కోట్లు చెల్లించిన నిర్మాణ సంస్థ.ఏప్రియల్ 14 లోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని గతంలో ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే నిర్మాణ సంస్థపై అసహనం వ్యక్తం చేసాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆందోళనకు పిలుపునివ్వటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు ఉదయం పది గంటల నుండి టోల్ గేట్ వద్ద బైపాస్ నిర్మాణం పూర్తి చేయాలంటూ నిరసన దీక్ష లో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే తో పాటు నియోజకవర్గంలోని ఆయన అనుచరగళం భారీగా తరలి వచ్చి ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు.