KNR: జూనియర్ విభాగాల్లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు రేపు నిర్వహించనున్నట్లు TG యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ KNR యూనిట్ కన్వీనర్ ఎం.రమేష్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని SEPలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ట్రెడిషనల్ యోగా, ఫార్వర్డ్ బైండ్, బ్యాక్ బెండ్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు ఈ నెంబరును 85229205612 సంప్రదించాలని కోరారు.