బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి ఇటీవల ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా గురించి కొన్ని విమర్శాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ, “కల్కి” సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభావవంతంగా నటించారని, కానీ ప్రభాస్ అంతంత మాత్రమే అనిపించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో ప్రముఖ నటులు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంచు విష్ణు, నాని, శర్వానంద్ వంటి నటులు ఈ వ్యాఖ్యలపై స్పందించారు.
మంచు విష్ణు: “అర్షద్ వర్సి ఒక అగ్రహీరో అయితే, ఆయన అభిప్రాయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభాస్ ఏ స్థాయిలో ఉన్నాడో మనకు తెలుసు. ఒక గ్లోబల్ స్టార్ ను పట్టుకుని ఇష్టానుసారంగా విమర్శలు చేయడం మంచిది కాదు. మనమందరం సినిమా వెళ్ళాం. ఇలాంటి కామెంట్స్ మరొకసారి చేయకుండా చర్యలు తీసుకోవాలని సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, సినీనటి పూనమ్ థిల్లాన్ కు లేఖ రాశారు.
నాని: నతురల్ స్టార్ నాని మాట్లాడుతూ… ప్రభాస్ లాంటి స్టార్ హీరో గురించి మాట్లాడితే కదా అర్షద్ వార్సీ లాంటి వ్యక్తి గురించి మాట్లాడతారు. గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ మాట్లాడుకోనంతగా అర్షద్ వార్సీ గురించి మాట్లాడుతున్నారు. పుబ్లిచిత్య్ కోసం ఇలాంటివి చేయకూడదు అని అన్నారు నాని.
శర్వానంద్: “ప్రభాస్ ఒక గొప్ప నటుడు. ప్రతి నటుడికి ప్రత్యేకత ఉంటుంది. ఒక నటుడు ఇంకో నటుడు గురించి ఎప్పుడు తక్కువుగా మాట్లాడకూడదు అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రభాస్ కు శర్వానంద్ మంచి స్నేహితుడు అనే విషయం తెలిసిందే
ఈ వ్యాఖ్యలపై, టాలీవుడ్ సెలబ్రిటీల స్పందనను చూస్తే, ప్రభాస్ పై అభిమానం, గౌరవం ఇంకా ఎక్కువగా ఉందని స్పష్టం అవుతుంది. ఎవరికి అయినా విమర్శలు ఉండవచ్చు, కానీ ప్రతి నటుడి పట్ల గౌరవం ఉండడం అవసరం.