Nallamala Forest: సృష్టి మనుగడకు శృంగారం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కార్యం అన్ని జీవుల్లో ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతీ జంతువు తన సహచరితో సంగమించడం సహాజం. అలా తమ వారసత్వాన్ని(Inheritance) కొనసాగిస్తూ ఉంటాయి. మరీ అలా చేయాలంటే ఏ ప్రాణులకు అయినా కూడా కాస్త ఏకంతమైన(isolated) ప్రదేశం కావాలి. మనుషులు ఎలా అయితే ఇళ్లు నిర్మించుకొని కాపురాలు చేసుకుంటారో జంతువులు కూడా అంతే వాటి గూడారాలు వాటికి ఉంటాయి. అది అడవిలో ఉండే వణ్యప్రాణుల పరిస్థితి మరీ ప్రేక్షకుల సందర్శనార్థం ఏర్పాటు చేసే జంతువుల పరిస్థితి ఎలా అంటే.. అవి కలిసే సమయంలో సందర్శకులను వెళ్లనీయకుండా నిర్వాకులు చూసుకుంటారు. తాజాగా ఇదే పరిస్థితి నల్లమలలో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్(Tiger Reserve Forest) లో చోటు చేసుకుంది. ఎంత జంతువులు అయినా, ఎంత క్రూరంగా వేటాడినా శృంగారం విషయంలో పులులు కూడా సిగ్గు పడుతాయని ఈ ప్రకటన చూస్తే అర్థం అవుతుంది.
నల్లమలలో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్(Nallamala Tiger Reserve Forest) లోకి ఎవరు రాకండి, పులిరాజా సరసాలకు సమయం ఆసన్నం అయింది. మీరొచ్చి డిస్టర్బ్ చేయవద్దని అధికారులు కోరుతున్నారు. నల్లమల అడవులు దేశంలో ఉన్న పులుల సంరక్షణ కేంద్రంలో ఎంతో ముఖ్యమైనవి. ఈ అడవుల్లో చిరుతలు, పెద్దపులులు చాలా సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. విస్తృతమైన ఈ అడవులు కర్నూలు, గుంటూరు, కడప, మహాబుబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే శ్రీ మల్లిఖార్జునుడు కొలువైన శ్రీశైలం ఆలయం ఉంది. దైవదర్శణానికి వచ్చిన భక్తులకు పులులు(Tigers) దర్శణం జరుగుతుంది. ఇక నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవుల్లోని పర్యాటక ప్రదేశాలన్నింటిలోకి ప్రవేశాన్ని జాతీయ పెద్ద పులుల సంరక్షణ సంస్థ (NTCA) నిలిపి వేస్తోంది. పులులు, వన్య ప్రాణుల కలయిక కాలం కాబట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయరణ్యలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటిలో మానవ సంచారాన్ని మూడు నెలల పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో అడవుల్లో జనసంచారం ఉంటే పులుల ఏకాంతానికి భంగం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి:Shivani rajasekhar: బ్యాక్ చూపిస్తున్న ప్రముఖ హీరో కుమార్తె