యిర్ పోర్టు నుండి వచ్చిన వీడియో.. ఇక్కడ ఒక అభిమాని సన్నీతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సన్నీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే సన్నీని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సన్నీ వైఖరిపై వినియోగదారులు ఇంటర్నెట్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Sunny Deol Video:బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన తాజా చిత్రం ‘గదర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక్కడ, ‘తారా సింగ్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎయిర్ పోర్టు నుండి వచ్చిన వీడియో.. ఇక్కడ ఒక అభిమాని సన్నీతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సన్నీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే సన్నీని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సన్నీ వైఖరిపై వినియోగదారులు ఇంటర్నెట్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక అభిమాని సెల్ఫీ కోసం అతని వైపు పరుగెత్తుతున్నప్పుడు సన్నీ డియోల్ బాడీగార్డులు అతనిని చుట్టుముట్టారు. అయితే సెక్యూరిటీ వారిని ఆపినప్పటికీ అభిమాని ఫోటో తీయడం కొనసాగించాడు. ఆ తర్వాత సన్నీ అతనిపై అరిచాడు. ఈ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు. సన్నీ డియోల్ ఎప్పుడూ చాలా అనాగరికంగా.. అభిమానిపై ఇలా కోపంగా ఉంటాడని వారు నమ్మలేకపోతున్నారు. దీనిపై నెటిజన్ల పలుకామెంట్లు చేస్తున్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘గదర్’ సీక్వెల్ ‘గదర్ 2’ థియేటర్లలో విడుదలైంది. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా, సిమ్రత్ కౌర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.