VZM: రైతులు అపరాలు మొక్కజొన్న పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా కట్టుకోవాలని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామాన్ని అరుణ సందర్శించారు. వర్షాలతో మొలకెత్తుతున్న వరిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో జనసేన పార్టీ నేతలు మునకాల జగన్నాధరావు (జగన్), బొత్స సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, మండల లక్ష్మనాయుడు పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో హీరో విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి బాలయ్యతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణి నీరజ గురించి ఆయన మాట్లాడారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతానని వెంకటేశ్ తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లెలో శుక్రవారం వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుండి కరెంటు ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై విద్యుత్ చార్జీలు పెంచిందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలన్నారు.

MHBD: మాజీ సర్పంచులకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని జిల్లా సర్పంచ్‌లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.
BHNR: ఆలేరు కాంగ్రెస్‌లో చిచ్చు పెడితే ఊరుకోబోమని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆలేరులో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మోటకొండూరులో యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ పెట్టారని, కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
SKLM: రాష్ట్రంలో ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం నుంచి అధికారులు కుల గణన పై వివరాలు స్వీకరిస్తారు. JAN 6వ తేది వరకు అభ్యంతరాలను పరిశీలించి, సమగ్ర వివరాల సేకరణ అనంతరం JAN 10న అన్ని సచివాలయంలో ప్రదర్శించాలన్నారు.

నిషేధిత లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు బావమరిది అయిన మక్కీ మధుమేహంతో బాధపడుతూ లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. మక్కీకి 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
VZM: ఆర్టీసీ జోనల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సియ్యారి దొన్నుదొర మొదటిసారిగా రేపు జిల్లా పర్యటనకు రానున్నారు. ఉ 9గంటల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దన్న జోనల్ ఛైర్మన్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని శుక్రవారం పత్రిక ప్రకటనను విడుదల చేశారు. విజయనగరం జోన్ పరిధిలో గల ఉద్యోగులు, ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు.

SKLM: జిల్లాలో మలేరియా, డెంగీ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా.బి మీనాక్షి అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయ ఆవరణలో ఆరోగ్య అధికారిణి జిల్లాకు మంజురైన ఫాగ్గింగ్ మెషిన్లను ప్రారంభించారు. ఈ పాగ్గింగ్ యంత్రాలు ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చు అని అన్నారు.
W.G: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఆచంట ఎస్సై వెంకట రమణను ఎస్పీ నయీం ఆస్మి అభినందించారు. ఆయన చేతుల మీదుగా అభినందన జ్ఞాపికను ఎస్సై వెంకట రమణ అందుకున్నారు.
ASR: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా గంగవరంలో ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రంపచోడవరంలో ర్యాలీ సబ్ స్టేషన్‌కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. గంగవరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
✦ కాలేయంలో కొవ్వు శాతం పెరగకుండా ఉంటుంది.✦ మానసిక సమస్యలు దూరమవుతాయి.✦ శ్వాసకోశ సమస్యలున్న వారికి మేలు చేస్తుంది.✦ శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.✦ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.✦ జుట్టు సమస్యలు దరిచేరవు.✦ చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.