సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి ఎదురుదెబ్బ గోగ్వాలేని నియమించడం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు శివసేన సంక్షోభం కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ స్పీకర్ పాత్రను నిర్ణయించనున్న విస్తృత ధర్మాసనం ఉద్ధవ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున MVA ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని SC చెప్పింది ఉద్ధవ్ మెజారిటీ కోల్పోయారని భావించి ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించడాన్ని గవర్నర్ తప్పుబట్టారని సుప్రీంకోర్టు ...
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
విజయ్ దేవరకొండ(vijay devarakonda), సమంత(samantha) నటించిన ఖుషి మూవీ నుంచి విడుదలైన నా రోజా నువ్వే(na roja nuvve) పాటకు మంచి స్పందన లభిస్తోంది. యూటూబ్లో 15 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతుంది. మరోవైపు ఈ పాట మరోఅరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పసిపిల్లలు, పిల్లలతో రైలులో ప్రయాణించడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. వారితో ప్రయాణించేటప్పుడు వారు తమను తాము బాధించుకోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు వారి వస్తువులను తీసుకువెళ్ళేటప్పుడు కూడా అదనపు జాగ్రత్త వహించాలి. ఈ క్రమంలో భారతీయ రైల్వే అలాంటి ప్రయాణికుల కోసం కొన్ని మార్పులు చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా లక్నోలో ప్రవేశపెట్టారు కూడా.
ఏపీ(ap)లో నేడు 45 మండలాల్లో, శుక్రవారం 104 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. దీంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మీరు హైదరాబాద్ కొండపూర్ వాసులా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు(Kondapur road) వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. ఈ మళ్లింపులు మే 13 నుంచి ఆగస్టు 10 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
సోమాజీగూడకు దేశంలోనే రెండో స్థానం రావడం ఎంతో సంతోషమని హైదరాబాదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ అమృత్‌సర్(amritsar)లోని స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ బాంబు పేలుడు(bomb blast) శబ్దం వినిపించింది. దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు జరగగా, ఈ ఘటన కారణంగా ఐదుగురిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly Elections 2023)కు నిన్న ఓటింగ్ జరిగింది. అయితే రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కర్ణాటకలో 72.67 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు తుది గణాంకాలు తెలుస్తాయని ఈసీ పేర్కొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్(exit poll) సర్వేలు నిజమవుతాయో లేదో ఇప్పుడు చుద్దాం.
తిరుపతి గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నలుమూలల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఏపీలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళలు 40 ఏళ్ల తర్వాత బరువు పెరగడం సర్వసాధారణం.. పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది స్త్రీల పొత్తికడుపు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే వారు ఉన్నారు.
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణాదాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు.
దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల కల్తీ రాజ్యం ఏలుతోంది.