జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చలాకీ చంటి అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె పోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు.
చైనాకు లక్ష కోతులను శ్రీలంక ఎగుమతి చేయనుంది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అరుదైన ‘టోక్ మకాక్’ కోతులు(toque macaque monkeys) ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి.
గుండెపోటుకు ముందు, శరీరం అనేక సంకేతాలను పంపుతుంది. ఛాతీ నొప్పి, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. గుండెపోటు సూచన కళ్లలో కూడా కనిపిస్తోందని అంటుంటారు. చర్మం కూడా గుండె జబ్బులను అంచనా వేయగలదని నిపుణులు అంటున్నారు.
గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు TSRTCను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని కోరింది.
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా హ్యారీ జోష్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మంచులక్ష్మీ ఆదిపర్వం సినిమాలోనూ నటిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు టపోరి సత్య(Tapori Satya) కన్నుమూశారు. అతని వయసు 45సంవత్సరాలు. మీడియా నివేదికల ప్రకారం, అతడికి కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రి(private hospital)లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు.
'మోదీ ఇంటిపేరు'తో దూషించారనే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తాత్కాలిక ఉపశమనం లభించింది. పాట్నా ప్రత్యేక కోర్టు(Patna Special Court)లో విచారణను నిలిపివేశారు. రాహుల్ మంగళవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పాట్నా హైకోర్టు(Patna High court) పేర్కొంది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.