ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. 2021 నవంబర్‌లో వరదల వల్ల స్వర్ణముఖి(Swarnamukhi) నదిపై ఉన్న లెవల్ కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయాయని స...
తన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లాపుల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. అందుకు 100 శాతం పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. ప్లాపులు తనకు కొత్త ఏం కాదని పేర్కొన్నాడు. ఒక దశలో వరుసగా 8, 16 చిత్రాలు హిట్టు కాలేదని గుర్తు చేశారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం తాజాగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. నిధుల లేమి కారణంగా మార్చి 9న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద కేవలం 500 మిలియన్ డాలర్ల విదేశీ మారకం మాత్రమే ఉండటంతో శ్రీలంక ప్రస్తుతం నిధుల కొరతతో ఇక్కట్ల పాలవుతోంది.
తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశం కోసం నడిచానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో భాగంగా తాను వేలాది మంది ప్రజలు, రైతుల సమస్యల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లో పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన (Seventh wage) సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై సీఎం బొమ్మై (CM Bommai) నీళ్లు చల్లారు. దీంతో వారు సమ్మె బాట పట్టనున్నారు. వారం లోగా శాసన సభలో జీతాల పెంపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప...
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ క్రమంలో చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీ పౌరుడు మృతి చెందాడు. అతను స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది.
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
నటీనటులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత హాల్దీ వేడుక పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఒక్కటయ్యారు. ఆకట్టుకుంటున్న వీరి పెళ్లి ఫొటోలను ఓ సారి చూసేయండి మరి.
చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్‌గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.