»It Seems That You Were Originally Born To Ys Rajasekhara Reddy Hariramajogaiahs Open Letter To Jagan
Harirama Jogaiah: అసలు మీరు వైఎస్ రాజశేఖరరెడ్డికే పుట్టారా?
మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని వైఎస్ జగన్ పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఘాటూ విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లళ్ల గురించి ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటు తీవ్ర విమర్షలు చేశారు.
It seems that you were originally born to YS Rajasekhara Reddy: Hariramazogaiah's open letter to Jagan
Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(AP CM Jagan) పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరి రామజోగయ్య(Chegondi Harirama Jogaiah) ఘాటూ విమర్శలు(Criticisms) గుప్పిస్తూ బహిరంగ లేఖ(open letter) రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy)తో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, మొదట్లో ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని రాసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకులపై రాజశేర్ రెడ్డి చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని, మీరు చేసే విమర్షలు మరి చిల్లరగా ఉన్నాయంటూ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఆరాధ్య నాయకుడు ప్రతిపక్ష నాయకుడైన పవన్ కల్యాణ్(Pawan Kalyan) పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించవచ్చని అనిపిస్తోంది. ఆయన వ్యక్తిగత విషయం అయిన పెళ్లిళ్ల గురించిన ప్రస్థావనను పదేపదే అనడం వెనుక మీ ఉద్దేశం ఏంటో ఏపీ ప్రజలు అర్థం చేసుకోగలరు. చట్టపరంగా చేసుకున్న పెళ్లిళ్ల విషయంలో ప్రజలకు లేని ఇబ్బందులు మీకెందుకు అని లేఖలో ప్రశ్నించారు. ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే తప్పేమిటని, ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి ఇలాంటి దిగజారిన విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది.
మాట్లాడితే పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను చంద్రబాబుకు(Chandrababu) దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్(AP) ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా అని వ్యాఖ్యానించారు.
మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా అని రాసుకొచ్చారు. ఇకముందు ప్రతిపక్ష నాయకుల(Opposition leaders)పై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు. ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ అంటూ తన లేఖలో హరిరామజోగయ్య(Hariramajogaiah letter) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.