»Guntur Si Raviteja Cheated By Her Saying That He Would Get Married Girl Complaint Police
SI cheating: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎస్సై మోసం చేశాడు..యువతి కంప్లైంట్
మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులకు చెప్పిన తర్వాత తనను అతనితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వెల్లడించింది.
ఏపీలోని గుంటూరు జిల్లా నగరంపాలెం ప్రాంతానికి చెందిన ఎస్సై కుంచాల రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆమె వెల్లడించింది. ఎస్సై రవితేజ తనను లవ్ చేస్తున్నానని చెప్పి 18 నెలలుగా తనతో గడిపాడని తెలిపింది. అంతేకాదు అనేక సార్లు అతను ఉంటున్న అపార్ట్ మెంటుకు కూడా తీసుకుపోయాని చెప్పుకొచ్చింది. అయితే ఆ యువతి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.
అయితే ఈ విషయమై 10 రోజుల క్రితమే ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశానని బాధిత యువతి పేర్కొంది. కంప్లైంట్ చేసినప్పటి నుంచి ఎస్సై, అతని ఫ్యామిలీ మెంబర్స్ తనను బెదిరిస్తున్నారని వెల్లడించింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తామని అన్నారని బాధితురాలు చెబుతోంది.
ఈ నేపథ్యంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతుంది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై ఎస్సై రవితేజను ప్రశ్నించగా..ఆ యువతి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. ఆమెతో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెబుతున్నారు.