అమెరికాలో హెచ్-5ఎన్-1 బర్డ్ ఫ్లూ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందటంపై శాస్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ జంతువుల్లో వ్యాప్తి చెందుతుందని.. దీని వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం లేదని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఒకవేళ మ్యుటేషన్ జరిగితే మాత్రం మానవాళిని కబలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.