ఇటీవల లెబనాన్, సిరియాలో భారీ ఎత్తున జరిగిన పేజర్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఆ పేజర్ దాడుల ఆపరేషన్‌కు తానే ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు ఆయన అంగీకరించారు. సెప్టెంబర్ 17న లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి. ఈ పేజర్ల దాడుల్లో దాదాపు 40 మంది మృతి చెందగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు.