హిందువుల ప్రత్యేక పండుగల్లో వసంత పంచమి ఒకటి. రేపు వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో 4వ రాజస్నానం నిర్వహిస్తారు. పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. చెట్లు నరకటం, మొక్కలు తొలగించే పనులు చేయకూడదు. వివాదాలు, మద్యం, మాంసం జోలికి వెళ్లకూడదు.