KRNL: జిల్లాకు చెందిన యూట్యూబర్ రమణను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్పై ఓ వీడియోలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమణపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.