VSP: అనారోగ్య కారణంగా ఆర్కే బీచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ శనివారం కాపాడారు. ఎన్ఎడీ ప్రాంతానికి చెందిన నున్న చిట్టిబాబు (72) అనే వ్యక్తి అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జీవీఎంసీ లైఫ్ గార్డులు ఆనంద్, ధనరాజ్, ఆయనను కాపాడి సీపీఆర్ చేసి అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.