KRNL: అలారుదిన్నె గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి దెబ్బతినడంతో, శనివారం నుంచి నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు నిషేధించబడ్డాయని రోడ్లు, భవనాల శాఖ డీఈఈ సురేష్ తెలిపారు. బళ్లారి, ఆలూరు నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనాలను ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మార్గాలతో మళ్లించడం జరిగిందని తెలిపారు. బళ్లారి వైపుకి వెళ్లే వాహనాలను కూడా మళ్లించడం జరిగిందని చెప్పారు.