నిరంతరం పర్యటకులతో రద్దీగా ఉండే కశ్మీర్లోని నిగీన్ సరస్సు ప్రస్తుతం జన సందడి లేక మూగబోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతి నుంచి టూరిస్టుల సందడి అక్కడ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పర్యటకంపైనే ఆధారపడి జీవిస్తున్న చాలా మంది ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. తమ కుటుంబాల పోషణ గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.