TG: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒక్కటయ్యారని.. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే మద్దతు ఇచ్చామని.. కానీ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినా నేతలు పాలనపై దృష్టి కేంద్రీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.